W.G: ఆకివీడు మండలం చినకాపవరం హైస్కూల్లో సోమవారం వన్యప్రాణి వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వన్యప్రాణులను కాపాడుకోవడం గురించి అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో కైకలూరు రేంజర్ రామలింగాచార్యులు, ఆకివీడు సెక్షన్ ఆఫీసర్ ఎం.రత్నరాజు, మండవల్లి సెక్షన్ ఆఫీసర్ రాంబాబు, ఆకివీడు FBOలు పాల్గొన్నారు.