MBNR: రాష్ట్రంలో పెంచిన బస్సు ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ప్రశాంత్ మాట్లాడుతూ.. ఛార్జీల పెంపుతో పేద, మధ్య తరగతి విద్యార్థులు మరియు నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.