MDK: రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఔట్సోర్సింగ్ కార్మికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గత రెండు నెలలుగా కాంట్రాక్టర్ తమకు వేతనాలు చెల్లించడం లేదని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ లింబాద్రికి వినతిపత్రం సమర్పించారు.