సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ జరుగుతుండగా ఓ న్యాయవాది CJI జస్టిస్ బీఆర్ గవాయ్పైకి బూటు విసిరేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై CJI స్పందిస్తూ, ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవని స్పష్టం చేశారు. అనంతరం ఆయన విచారణను కొనసాగించారు. ఆ న్యాయవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.