SRD: ఉద్యోగులకు పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికలపై శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..ఎన్నికలు పకడ్బందీగా జరిగేలా సహకరించాలని చెప్పారు. కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.