MBNR : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ సంఘటన మిడ్జిల్ మండలంలో సోమవారం ఉదయం జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం.. HYD నుంచి మిడ్జిల్ వస్తున్న ఓ కారు మిడ్జిల్ నుంచి తలకొండపల్లి వెళ్తున్న ఓ ఆటో రెండు వాహనాలు వెల్జాలలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.