అనకాపల్లి: ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో సోమవారం బీచ్ వాలీబాల్ పోటీలను ఎంపీపీ వెంకటలక్ష్మి, మండల టీడీపీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, టీడీపీ ప్రారంభించారు. టోర్నమెంట్ నిర్వాహకుడు కోడా లోవరాజు మాట్లాడుతూ.. అండర్ 17 విభాగంలో బాలుర టీమ్స్ 24, బాలికల టీమ్స్ 13, అండర్ 14 విభాగంలో బాలురు టీమ్స్ 10, బాలికల టీమ్స్ 7 పాల్గొంటున్నాయన్నారు.