కృష్ణా: శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఘంటసాల మండల శ్రీకాకుళంలో కరకట్టపై ఉన్న వినాయకుడి గుడి వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అమ్మవార్లను కమిటీ సభ్యులు నిమజ్జనానికి కృష్ణానదికి తరలించారు.