KKD: సమృద్ధి ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ 2.0తో మరో ముందడుగు వేసిందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పేర్కొన్నారు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ‘జీఎస్టీ 2.0-నూతన స్లాబ్ విధానం’పై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వస్తు సేవల పన్ను తగ్గింపుతో రైతులు, వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజలకు కలిగే లాభాలను వివరించారు.