GNTR: బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగడంపై ఫిరంగిపురం సీఐ శివరామ కృష్ణ హెచ్చరికలు జారీ చేశారు. బహిరంగ మత్తు వల్ల గొడవలు, హత్యల వంటి తీవ్ర నేరాలు జరిగే అవకాశం ఉందన్నారు. శాంతిభద్రతలు, ప్రజల భద్రత దృష్ట్యా ఎవరైనా బహిరంగంగా మద్యం తాగే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఇవాళ స్పష్టం చేశారు.