BDK: అశ్వరావుపేట మండలం కావడి గుండ్ల గ్రామానికి చెందిన సోమరాజు మండల స్థాయి క్రీడల్లో ఉత్తమ స్థాయి ప్రతిభను కనపర్చి స్టేట్ స్పోర్ట్స్ మీట్‌కు ఎంపికయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో క్రీడాకారుడుని పుష్పగుచ్చం అందజేసి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సాహకం అందజేశారు.