ADB: కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. కౌలు రైతులకు సైతం అంశంపై అవగాహన తప్పనిసరి అన్నారు. స్లాట్ బుకింగ్, తదితర అంశాలపై అధికారులతో చర్చించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.