BDK: పాల్వంచ మండలంలోని జగన్నాధపురం గ్రామంలో కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో మంగళవారం చండీ హోమం జరగనుంది. ఈ పూజలో పాల్గొనే భక్తులు రూ.2516 రూపాయలు చెల్లించి దేవాలయ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూజలో పాల్గొనే భక్తులకు అమ్మవారి శేష వస్త్రం తో పాటు అన్నప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు.