NLG: రైతులు పచ్చి ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి చీనా నాయక్ సోమవారం తెలిపారు. ధాన్యంలో తేమ శాతం 17% మించకుండా ఆరబెట్టుకుని మార్కెట్కు తీసుకురావాలని కోరారు. యార్డులో ధాన్యాన్ని రాశులుగా మాత్రమే పోసుకోవాలని, కల్లాల కోసం ముందస్తుగా టార్పాలిన్ కవర్లు కప్పి పెట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.