KRNL: ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ముందర సీపీఐ నాయకులు సోమవారం నిరసన చేపట్టారు. అకాల వర్షాల వల్ల రైతులకు ఎకరాకు 50 వేల రూపాయలు పంట నష్టాన్ని ప్రభుత్వం కట్టించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్లో రైతులు బ్యాంకులలో తీసుకున్న అప్పులను ప్రభుత్వం ఎత్తివేయాలని సీపీఐ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.