JN: బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ఉమ్మెంతల సాయిరెడ్డి (33) ఈ నెల 3న భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో మనస్తాపంతో సాయిరెడ్డి ఆదివారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స సమయంలో సోమవారం మృతి చెందాడు.