KMM: కొంతకాలంగా నగరంలో పంచాయితీలు, ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం నగరంలో ప్రజల శాంతిభద్రతలకు నష్టం కలిగించే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని నగర ఏసీపీ రమణమూర్తి పేర్కొన్నారు. ఘర్షణలు గొడవలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాలన్నారు.