కోనసీమ: కాకినాడ క్రీడా మైదానంలో జరిగిన ఎన్జీఎఫ్ఐ కుస్తీ పోటీలలో పేరూరు హై స్కూల్ విద్యార్థులు సాయికుమార్, సుదీప్‌లు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్ – 17 విభాగంలో ప్రీ స్టైల్, గ్రీకోరరోమన్ పోటీలలో వీరు విజయం సాధించినట్లు పీఈటీ రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విజేతలను పలువురు గ్రామ పెద్దలు అభినందించారు.