NZB: రుద్రూర్ మండల కేంద్రంతో పాటు రాయకూర్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహశీల్దార్ తారాబాయి సోమవారం ప్రారంభించారు. ఏ గ్రేడు ధాన్యం క్వింటాకు రూ. 2,389, బీ గ్రేడ్ ధాన్యం రూ. 2,369 ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యసాయాధికారి సాయి కృష్ణ, ఏఈవో వెంకటేష్, సంఘ కార్యదర్శి లక్ష్మణ్, సాయి కిరణ్ పాల్గొన్నారు.