ప్రకాశం: పామూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాజశేఖర్ సోమవారం తెలిపారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు పూర్తి బయోడేటాతో అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ కాపీలతో ఈనెల 9 తేదీలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.