SDPT: అక్కన్నపేట మండలం నందారం గ్రామంలో సాదాబైనామా 2020 సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న వారికి రెవెన్యూ శాఖ తరుపున వచ్చిన నోటీసులను గ్రామ పరిపాలన అధికారి రాజు సోమవారం పంపిణీ చేశారు. భూమిని కొనుగోలు చేసిన వారందరికీ నోటీసులు వచ్చినట్లు తెలిపారు. ఆ నోటీసుల ప్రకారం అమ్మకాలు, కొనుగోలు ఇద్దరి వ్యక్తుల అభిప్రాయాల ప్రకారంగా పట్టాలు చేయనున్నట్లు వెల్లడించారు.