NLG: జిల్లాలో రైతులకు గతేడాది యాసంగి సీజన్‌కు సంబంధించిన ధాన్యం బోనస్ విడుదల కాకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం కోతలు మొదలైనా ఇంకా బోనస్ సొమ్ము అందలేదు. జిల్లాలో రైతులు విక్రయించిన 1.78 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ.8.91 కోట్లు బోనస్ గా వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది.