BHPL: పట్టణంలోని వేశాలపల్లిలో ఇవాళ మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి స్థానిక నేతలతో కలిసి కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పి, అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిన BRSను ఆదరించాలని ప్రజలను కోరారు.