KRNL: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ నెల 8న కర్నూలుకు రానున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10:30 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 1 గంటకు కర్నూలుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మంత్రి పర్యటనకు సంబంధించి ప్రభుత్వం సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.