E.G: పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతామని నిడదవోలు MLA, మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం విజయవాడలో రాష్ట్ర సైన్స్ & టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్‌గా మందలపు రవికుమార్‌తో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. సామాన్యుడి జీవితాల్లో మార్పుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలన్నారు.