SRCL: దక్షిణ కాశీగా ప్రసిద్ధించిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని సోమవారం (నిజామాబాద్ జిల్లా) అంతర్జాతీయ హాకీ ప్లేయర్ యేండాల సౌందర్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సౌందర్య మాట్లాడుతూ.. పదేళ్ల తర్వాత గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇండియన్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు.