NGKL: ఉప్పునుంతల మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అఖిల్, నందిని, రాముకు సోమవారం ప్రధానోపాధ్యాయుడు ఆంజనేయులు, సర్టిఫికెట్లు అందజేశారు. వీరు ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా తరపున పాల్గొన్నారు. క్రీడలతో పాటు విద్యలో కూడా రాణించాలని వారు కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.