WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సోమవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. పంటలు ఎరుపెక్కుతున్నా ఎరువు అందకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుండి క్యూలో నిలబడినా యూరియా బస్తాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి సరిపడా యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు.