W.G: తాడేపల్లిగూడెంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా నిర్మించిన రెండో ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. కొన్ని సంవత్సరాలుగా బాగానే ఉన్నా ఇటీవల ట్రాఫిక్, వర్షాల కారణంగా బ్రిడ్జి ఫుట్పాత్లు దెబ్బతిన్నాయి. పలకలు పగిలి, నడవడానికి ఇబ్బందిగా మారింది. రోడ్డుపై గుంతలు పడి వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.