KMM: కల్లూరు మండలంలో ప్రభుత్వ దవాఖానలో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సోమవారం రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది డాక్టర్లు ఒక గంట లేదా రెండు గంటలు కంటే ఎక్కువ కూడా వారి సేవలు ప్రభుత్వ దవాఖానాలో అందించని దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఒక్కరోజు కూడా వైద్యులు సమయానికి వచ్చి సేవలు అందించడం లేదన్నారు. ఉన్నత అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.