సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లె మండలం ధంపెట్ల గ్రామంలో శ్రీ సీతారాముల వారి దేవస్థానం నిర్మాణానికి సోమవారం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ పాల్గొని ఆలయ పనులను ప్రారంభించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.