HNK: వృద్ధురాలి మెడల నుంచి బంగారు పుస్తెలతాడును అపహరించిన ఘటన ఐనవోలు మండలంలో సోమవారం జరిగింది. మనమ్మ అనే మహిళ కొండపర్తి గ్రామ శివారులో నడుచుకుంటూ వెళ్తున్నది. ఓ వ్యక్తి బైకుపై వచ్చి లిఫ్ట్ ఇస్తానని ఆమెను ఎక్కించుకున్నాడు. బండి దిగి వెళ్తున్న క్రమంలో ఆమె మెడలోని 2తులాల బంగారు పుస్తెలతాడు లాక్కొని పారిపోయాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.