»Pawan Fans Scared About Harish Shankar Over Ustad Bhagat Singh
పవన్ అభిమానులను భయపెడుతున్న హారీష్
ఇటీవలి రవితేజతో తీసిన దారుణమైన డిజాస్టర్ మిస్టర్ బచ్చన్ గుర్తొస్తే చాలు పవన్ అభిమానులు నీరుగారిపోతున్నారు. పైగా హరీష్ తాజాగా ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ్లో విజయ్ యాక్ట్ చేసి తెరీకీ రీమేక్. ఇదే తమిళ చిత్రాన్ని హిందీలో బేబీ జాన్‌గా తీస్తే అది కాస్తా బాక్సాఫీసు దగ్గర దారుణంగా దెబ్బతింది.
ఏ హీరో అభిమానులైనా ఓ దర్శకుడు తమ అభిమాన హీరోకి హిట్ ఇస్తాడంటే ఎంతో ఆనందంగా ఎదురుచూస్తారు. ఆ డైరెక్టర్ వ్యవహరం ఎలా ఉంది అన్నది కూడా వాళ్లు పరిశీలిస్తారు. ఆ దర్శకుడి మువ్మెంట్స్ అండ్ ఎక్సెపెరిమెంట్స్ అయితే వాళ్ళల్లో ఆశలు నింపడం కానీ, లేదా నిరాశను పెంచడం కానీ చేస్తుంటాయి. ఇది ఒక్క హీరో అని కాదు. ఎవ్వరికైనా, ఏ భాషలోనైనా కూడా సరిసమానం. ట్రూలీ కామన్.
అదే ఇప్పుడు దర్శకుడు హరీష్ శంకర్ అంటే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానులు చాలా భయపడుతున్నారు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ అని ఓ పక్క ఆనందపడదామన్నా కూడా ఇటీవలి రవితేజతో తీసిన దారుణమైన డిజాస్టర్ మిస్టర్ బచ్చన్ గుర్తొస్తే చాలు పవన్ అభిమానులు నీరుగారిపోతున్నారు. పైగా హరీష్ తాజాగా ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ్లో విజయ్ యాక్ట్ చేసి తెరీకీ రీమేక్. ఇదే తమిళ చిత్రాన్ని హిందీలో బేబీ జాన్‌గా తీస్తే అది కాస్తా బాక్సాఫీసు దగ్గర దారుణంగా దెబ్బతింది. మరీ ముఖ్యంగా తెరీ సినిమాని ఓటీటిలో చూడనివాడు లేడు. ఈ మధ్యరోజుల్లో తమిళ్ వెర్షన్ సినిమాలు కూడా మనవాళ్ళు అడ్డంగా చూసేస్తున్నారు. మంజుమ్మల్ బాయ్స్ సినిమాని తెలుగులో డబ్ కాకుండానే తమళ్‌లో పుంఖానుపుంఖాలుగా చూసేశారు. అయినా తెలుగు వెర్షన్ బాగా అడిందనుకోండి. కానీ ఉస్తాద్ వరకూ వస్తే హరీష్ ఫార్మ్ మీదనే అందరికీ అనుమానాలు.
అయితే పవన్ కళ్యాణ్‌కి ఇది మొదటిసారి కాదు రీమేక్స్ చేయడం. అజ్ఞాతవాసి తర్వాత ఆయన చేసినవన్నీ కూడా దాదాపుగా రీమేక్సే. భీమ్లానాయక్, వకీల్‌సాబ్ చిత్రాల ఒరిజినల్స్ తెలుగోళ్ళు పెద్దగా చూసింది కూడా లేదు. వకీల్‌సాబ్ విషయంలో అమితాబ్ చేసిన పాత్రనే తెలుగులో పవన్ కళ్యాణ్ చేశారు. వాళ్ళిద్దరికీ ఇమేజ్ క్లాష్ లేదు. అదొక్కటి బాగా ప్లస్ అయింది. భీమ్లానాయక్ విషయంలో మళయాళంలో నటించిన ఇద్దరికిద్దరూ ఏమంత పాప్యులర్ నటులు కాకపోవడం సేవింగ్ ఫాక్టర్ అయింది. పైగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వెళ్ఙపోతున్నారన్న వాతావరణం ఒకటి ఆ సినిమాల మీద విపరీతమైన వ్యామోహాన్ని పెంచేసింది.
ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్‌కి చుట్టూ అన్నీ కత్తులే ఉన్నాయి. ప్లస్ పాయంట్ ఒక్కటే ఒక్కటి. అదే పవన్ కళ్యాణ్. కానీ బావులేదంటే లేదా చూసిందే చూసినట్టనిపించినా కూడా డేంజరే. పవన్ కళ్యాణ్ కూడా ఫ్లాపులకి అతీతుడు కాదన్నది గతం చెబుతోంది. తెరీ సినిమాని పదేపదే చూసేయడం, స్టార్ మాలో తరచూ వచ్చేయడంతో పాటు హరీష్ శంకర్ ప్రస్తుత ట్రెండ్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు.. మీడియాతో పిచ్చిపిచ్చిగా మాట్లాడడం, తగుదునమ్మా అని అన్నిటినీ మీదేసుకుని చాలా అన్‌పాప్యులర్ అయిపోయాడీ మథ్యన. అన్నిటినీ మించి మిస్టర్ బచ్చన్ ప్లాపు. అక్కడ బేబీ జాన్ ప్లాఫ్.
వీటన్నిటినీ అధిగమించి నిజంగానే హరీష్ ఉస్తాద్‌ని హిట్ చేస్తే పవన్ అభిమానులు నెత్తిన పెట్టుకుని పాలాభిషేకాలు చేస్తారు. మరి హరీష్ జాతకం ఎలా ఉందో మరి!