పవన్ కళ్యాణ్… మెగాస్టార్ తమ్ముడుగా సినీ ప్రస్థానం మొదలుపెట్టి… ఈరోజు డిప్యూటీ సీఎం వరుకు ప్రతి విషయంలో తన ప్రత్యేకతను చాటే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదల నాగబాబు, ‘గబ్బర్ సింగ్’ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా రీరిలీజ్ చేయబడింది. ఈ సందర్భంగా నాగబాబు పవన్ కళ్యాణ్ తన అప్పులు తీర్చేందుకు ఈ సినిమా చేశాడని చెప్పారు.
నాగబాబు మాటలు ప్రకారం, ‘గబ్బర్ సింగ్’ సినిమా తీసే సమయంలో పవన్ కళ్యాణ్ తన సోదరుడి ఆర్థిక స్థితిని గమనించి, నిర్మాత బండ్ల గణేశ్ కు ఒక ప్రత్యేక ఆదేశం ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ బండ్ల గణేశ్ కి చెప్పినట్లు, సినిమా ప్రాఫిట్ మొత్తం నాగబాబుకు ఇవ్వాలని, అప్పులు కట్టాలన్నది తన ఉద్దేశ్యం అని తెలిపారు. కానీ, సినిమా కంప్లీట్ అయ్యాక ఔట్పుట్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారట.
పవన్ కళ్యాణ్ సినిమా కంటెంట్ మంచి ఫలితాన్ని ఇవ్వబోతుందని నమ్మడంతో, బండ్ల గణేశ్ కష్టాన్ని గుర్తించి, సినిమాకు వచ్చే మొత్తం లాభాన్ని బండ్ల గణేష్ ని తీసుకోమ్మన్నారట. కానీ, పవన్ కళ్యాణ్ తన సోదరుడి అప్పులు తీర్చాలని తనకు పారితోషికం ఇవ్వాలని సూచించారట. ఈ విధంగా, పవన్ కళ్యాణ్ తన సోదరుడి ఆర్థిక బాధ్యతలను తగ్గించేందుకు పెద్ద మొత్తంలో సహాయం చేశాడు.
నాగబాబు మాట్లాడుతూ నిజానికి అప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా పెద్దగా బాలేదు.. అయినా కూడా తన అన్న గురించి అలోచించి ఒకరకంగా చూస్తే సినిమా రెమ్యూనరేషన్ మొత్తం నాకు ఇచేసినట్టే.. కుటుంబానికి కష్టకాలంలో ఈ విధంగా అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ కు హ్యాట్సాఫ్