తారకరత్న… ప్రతీ తెలుగుదేశం కార్యకర్తకు సుపరిచితుడు. లోకేష్ పాదయాత్ర ప్రారంభం రోజున కుప్పకూలి ఎన్నో రోజులు హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మృతిచెందాడు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి విజయసాయిరెడ్డి కి బంధువు. వేరు వేరు సామాజికవర్గాలు అయినప్పటికీ… అలేఖ్య కు పెళ్ళయ్యి విడాకులు తీసుకున్నా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి తారకరత్న, అలేఖ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. తారకరత్న ఆకస్మిక మృతి అందరినీ తీవ్రంగా కలచివేసింది. ఈరోజు అలేఖ్య పుట్టినరోజు సంధర్భంగా షర్మిల తన కూతురితో అలేఖ్య రెడ్డి ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించి విష్ చేసింది
షర్మిల ప్రేమకు అలేఖ్య ఎమోషనల్ అయిన విడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. గతంలో షర్మిల కొడుకు పెళ్లికి కూడా భర్త అనిల్ తో కలిసి అలేఖ్య ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారు. ఈరోజు అలేఖ్య బర్త్డే సందర్భంగా పార్టీలకు అతీతంగా అలేఖ్య పై షర్మిల చూపించిన ప్రేమకు, స్వయంగా ఇంటికి వెళ్లి విష్ చేయడంపై నెటిజన్లు కూడా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు