బంగారం సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతోంది. రోజురోజుకూ ధర దూసుకుపోతోంది. ఇవాళ కూడా పసిడి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,370 పెరిగి రూ.1,20,770కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,250 పెరిగి రూ.1,10,700గా ఉంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.1,64,900కి చేరింది.