E.G: రాజమండ్రిలోని ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు డైరెక్టర్‌గా టీడీపీ సీనియర్ నాయకురాలు తురకల నిర్మల నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాజమండ్రి నగర టీడీపీ కార్యాలయంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమెను ఎమ్మెల్యే పార్టీ నాయకులతో కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.