KMM: ముదిగొండ మండలం పెద్దమండవ, గంధసిరి మున్నేరు నుంచి ఇసుకను అక్రమంగా తరలుస్తున్న 5 ట్రాక్టర్లను సీఐ మురళి ఆదేశాలతో సువర్ణాపురం వద్ద పట్టుకొని పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసినట్లు సోమవారం తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేపట్టే ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.