కామారెడ్డి కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. ఏవో మసూద్ అహ్మద్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి రసీదులను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కోరారు.