MLG: ఏటూరునాగారం పట్టణంలో పారిశుద్ధ్య లోపంతో వీధులు కంపుకొడుతున్నాయి. ప్రధాన రహదారులపై GP సిబ్బంది నామమాత్రంగా పారిశుద్ధ్యం చేస్తున్నారు. అంతర్గత రోడ్లపై చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. చెత్త దగ్గర పందులు స్వైరవిహారం చేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు సోమవారం డిమాండ్ చేశారు.