HYD: హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు మిర్యాలగూడ వద్ద సాంకేతిక లోపంతో గంటసేపుగా నిలిచిపోయింది. ఇంజిన్తో తలెత్తిన లోపం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో ఇంజిన్ తక్షణం పంపేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. పరిస్థితిని సమీక్షించేందుకు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.