రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న మూవీ ‘రాజాసాబ్’. ముగింపు దశలో ఉన్న ఈ మూవీ షూటింగ్ ఈ వారం నుంచి యూరప్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే చిత్రబృందం అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో రెండు పాటలను షూట్ చేయనున్నారట. మరోవైపు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.