SKLM: ఆమదాలవలస మండలం మునగవలస జంక్షన్ వద్ద రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. దీంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు తెలిపారు. స్థానిక యువత స్పందించి, స్వచ్ఛందంగా గుంతలను పూడ్చిపెట్టారు. యువత స్ఫూర్తికి వాహనదారులు, స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. అధికారులు స్పందించి శాశ్వత రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.