HYD: సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో లోక కళ్యాణం కోసం ఈ రోజు చండీ హోమం నిర్వహించారు. ఈ హోమంలో వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జీ.మనోహర్ రెడ్డి, ఫౌండర్ ఫ్యామిలీ సభ్యులు సురిటి రామేశ్వర్ పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. వందలాదిమంది భక్తులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారి సన్నిధిలో పూజలు చేశారు.