KMR: మద్నూర్ మండల కేంద్రంలోని పోచమ్మ గల్లీలో ప్రధాన నీటి పైప్ నుంచి దుర్వాసనతో నీరు వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజులుగా ఇలాంటి నీరే వస్తోందని పేర్కొన్నారు. సోమలింగాల గుడికి వెళ్లే దారి పక్కన బోరు నీటి పైప్లైన్ లీకేజీ అవుతోందని చెప్పారు. మురుగు నీటితో అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందన్నారు.