ATP: గుంతకల్లు మండల తహశీల్దార్ కార్యాలయంలో ఇవాళ జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తహశీల్దార్ రమాదేవి మాట్లాడుతూ.. ప్రజల నుంచి భూ సమస్యలు, వివిధ సమస్యలపై స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ చేపట్టి త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు.