తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వరదలు సంభవించడంతో, బాధితులకు సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. ఆయన ముందుగా 1 కోటి రూపాయల రక్షణ నిధిని ప్రకటించారు. ఈ సంక్షేమ నిధిని అందజేయడంకోసం పవన్ కళ్యాణ్ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా 1 కోటి రూపాయల చెక్కును రేవంత్ రెడ్డికి అందించారు.
ఇక, ఈ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య ఉన్న సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా చర్చించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు మరింత మంచి సేవలందించడానికి పలు ప్రణాళికలు చర్చకు వాచినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం తగ్గి ప్రజలు తమ రెగ్యులర్ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. బుడమేరు వాగుకి పడిన గాండ్లను కూడా అప్ ప్రభుత్వం పూడ్చింది