NTR ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘దేవర’ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఈ ట్రైలర్ లో సినిమా గురించి చెప్పే చాలా విషయాలు ఉన్నాయి. సినిమా రేంజ్ గురించి స్పష్టమైన అవగాహన ఇస్తుంది. ట్రైలర్ చూస్తే, ‘దేవర’ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే అన్నట్టు ఉంది. ఈ ట్రైలర్ సినిమా ఒక విజువల్ ఎక్స్‌ట్రావగాంజా అని తెలియజేస్తోంది.
కోరటాల శివ ముహూర్తం రోజు సినిమా గురించి మాట్లాడినప్పుడు, ఈసారి చాలా పెద్ద సినిమా చేయబోతున్న అని చెప్పారు. నిజంగా ట్రైలర్ చూస్తే, ఈ సినిమా అంత పెద్దదిగా, విభిన్నంగా ఉండవచ్చుననే భావన కలుగుతుంది. NTR ద్విపాత్రాభినయంతో అదరగొట్టినట్లు కనిపిస్తున్నారు. ఈ రెండు పాత్రల్లో కూడా ఆయన నటన అద్భుతంగా ఉంది. ప్రతి సాంకేతిక విభాగం ఈ సినిమాలో నాణ్యతతో పనిచేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం ఈ ట్రైలర్లో తెలుస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలో కూడా డైరెక్టర్ శివ జాగ్రత్త తెలుస్తుంది. మొత్తానికి దేవర కొరటాల శివ గత సినిమాల రిఫరెన్స్ లు ఎక్కడ కనిపించకుండా ఫ్రెష్ గా ఉంది. ఈ సినిమాను 27 సెప్టెంబర్ న థియేటర్లలో విడుదలకు సిద్దమవుతుంది. ‘దేవర’ సినిమా ఇప్పటికే అమెరికాలో ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో సునామి సృష్టిస్తోంది.
సినిమా ట్రైలర్ చూసి, ‘దేవర’ మంచి ఓపెనింగ్‌ను సాధిస్తుందనే విషయం తెలుస్తుంది.