సౌత్ ఇండియన్ సెన్సషనల్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్… ఇటీవల విడుదల చేసిన ‘దేవర’ చిత్రానికి సంబంధించిన రెండో సింగిల్ ‘చుట్టమల్లె’ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలుగు లిరికల్ వీడియోకు యూట్యూబ్ లో దాదాపు 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే, ఈ పాట విడుదలైన వెంటనే అనిరుధ్‌కు సంబంధించిన కొన్ని ట్రోల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.
ఈ పాటలోని మ్యూజిక్, వీడియో ఎలిమెంట్స్‌పై అభిమానులు మరియు ప్రేక్షకులు విభిన్నంగా స్పందించారు. పాటకు చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినప్పటికీ, కొందరు మాత్రం అనిరుధ్ ట్యూన్స్ ను గత ఏడాది బాగా వైరల్ అయిన శ్రీలంక సాంగ్ ‘మానికే మగ హితే’ తో పోల్చి అనిరుద్పై ట్రోల్ల్స్ చేశారు.
కొంతమంది యూట్యూబర్లు కూడా రివ్యూ వీడియోస్, రియాక్షన్ వీడియోల్లో ఈ పాత ఎక్కడో విన్నట్టు ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనిరుధ్ మిగతా పాటలతో, సినిమా లో రీరికార్డింగ్ తో ఈ వ్యతిరేకతలను అధిగమించగలడా? చూడాలి. అనిరుధ్ కు రజినీకాంత్ జైలర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘చుట్టమల్లె’ పాటకు మంచి ఆదరణ వస్తోన్నా, టార్గెట్ అయిన క్షణాలను అనిరుధ్ ఎలా ఎదుర్కొంటాడో ఆసక్తికరంగా ఉంది.