NLG: ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం పనిచేస్తూ ప్రజాబలంతో డీవైఎఫ్ఐ నాయకులు సర్పంచులుగా గెలుపొందడం అభినందనీయమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ అన్నారు. నల్గొండలో శనివారం జరిగిన సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ఆయన విచ్చేసి మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఆయన సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు రవి, కార్యదర్శి మల్లం మహేష్ పాల్గొన్నారు.